పూనుగొండ్లలో నాగవెల్లి తంతు.. వైభవంగా తిరుగువారం జాతర

పూనుగొండ్లలో నాగవెల్లి తంతు.. వైభవంగా తిరుగువారం జాతర

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం జాతరను వైభవంగా నిర్వహించారు. మేడారానికి పెండ్లికుమారుడిగా వెళ్లిన పగిడిద్దరాజును మహాజాతర ముగిసిన అనంతరం తిరిగి పూనుగొండ్లకు తరలించారు. తిరుగువారంలో భాగంగా నాగవెల్లి తంతును పూజారులు నిర్వహించారు.

 గురువారం దేవుని గుట్ట నుంచి వనాన్ని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలతో గ్రామం మార్మోగింది. పిల్లలు లేని మహిళలు సమ్మక్క గద్దె వద్ద సంతానం ప్రసాదించాలని సంతు(వరం) పట్టారు. సాయంత్రం స్వామికి గంగాస్నానం చేయించి గ్రామంలో ఊరేగించారు. రాత్రి మండమెలిగె పూజ నిర్వహించి గుడిని శుద్ధి చేశారు.